తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఈసారి రాష్ట్ర గవర్నర్ తమిళ్సై ప్రసంగం లేకుండానే మంత్రి హరీశ్ రావు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దీంతో ప్రతిపక్షాలు వ్యతిరేక నినాదాలు చేస్తూ, సభనుంచి వాకౌట్ అయ్యారు.మరోవైపు హరీశ్ రావు 3వ సారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ”ఈరోజు పెట్టబోయే బడ్జెట్ తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని కల్గిస్తుంది. రూ. 2,56,958.51 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1.89 లక్షల కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం రూ. 29,728 కోట్లు. రాష్ట్రం ఆవిర్భవించిన అనతికాలంలో అద్భుత ప్రగతి సాధించాం. కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ ప్రగతి పథంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. పరిపాలనలో రాజీలేని వైఖరిని టీఆర్ఎస్ అవలంభించింది. కరెంట్ కోతలు, ఆకలి చావులు ఇప్పుడు లేవు” అని హరీశ్ రావు అన్నారు.
మరోపక్క గవర్నర్ ప్రసంగం లేకుండా ప్రారంభమైన సమావేశాలపై బీజేపీ సభ్యులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళ్సై మాట్లాడుతూ.. తెలంగాణ బడ్జెట్ ప్రజలకు అనుగుణంగా ఉండాలి. రెండు సంవత్సరాలుగా ప్రజలకు ఎంతో దగ్గరయ్యాను. తెలంగాణ ప్రజల అభివృద్దినే కోరుకుంటున్నా అని అన్నారు.