అసెంబ్లీ లో దొంగలు పడ్డారు..! - MicTv.in - Telugu News
mictv telugu

అసెంబ్లీ లో దొంగలు పడ్డారు..!

August 14, 2017

ఇండ్లల్ల ఆపీసులల్ల,దుకుణాలల్ల దొంగతనం చేశి చేశి బోర్ కొట్టినట్టుంది దొంగలకు..అందుకే  ఏకంగా  అసెంబ్లీకే కన్నం బెట్టిన్రు. కేరళ అసెంబ్లీలో శాసనసభ్యుల వసతి గృహం, అసెంబ్లీ భవనం లోపల అమర్చిన అగ్నిమాపక పరికరాలను ఎత్కపోయిన్రట,అసెంబ్లీ హాస్టల్‌ లో ఉన్న అగ్నిమాపక పరికరాలే ఎక్కువగా చోరీకి గురయ్యాయని అధికారులు గుర్తించారట.

అత్యంత భద్రత ఉండే అసెంబ్లీ ప్రాంతంలనే దొంగతనం జేశిన్రంటే దొంగలు ఎంత తీస్మార్కాన్లో సూడున్రి.చోరీ విషయమై భద్రతాసిబ్బంది సోమవారం స్పీకర్‌కు ఫిర్యాదు చేశారట.కనీ  గంత గట్టి బందోబస్తు ఉండే అసెంబ్లీలనే దొంగతనం జరిగిందంటే…ఇదేదో ఇంటి దొంగల పని గనే గావచ్చు,లేకపోతే గంత భద్రత ఉన్న గన్లకు అవుతలోడు ఎవడస్తడనీ..అంటున్రట గీ ముచ్చట తెల్శినోళ్లు.