23 లేదా 25 నుంచి అసెంబ్లీ

ఈ నెల 23 లేదా 25వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే అవకాశముందని నీటిపారుదల మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. అసంబ్లీ సమావేశాల్లో మొత్తం 8 బిల్లులు ప్రవేశపెడతామని వెల్లడించారు. సమావేశాలను ఎన్నిరోజులైనా నిర్వహించడానికి, ప్రజల సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు విపక్షాలు ప్రతిపాదన తెస్తే ఆమోదం తెలిపుతామన్నారు.

SHARE