ఏపీ అసెంబ్లీ.. క్రిమినల్ కేసు పెట్టాలని స్పీకర్ ఆదేశం - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ అసెంబ్లీ.. క్రిమినల్ కేసు పెట్టాలని స్పీకర్ ఆదేశం

December 13, 2019

Tammineni Sitaram.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. నిన్న సభలోకి వస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు మార్షల్స్‌కు మధ్య జరిగిన వాగ్వాదంపై సభలో చర్చ చేపట్టారు. టీడీపీ సభ్యులు మార్షల్స్‌పై దురుసుగా ప్రవర్తించారంటూ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సంపధాయాలను కాపాడాలని సభ్యులకు సూచించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మార్షల్స్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. గుంపులుగా ఇతర వ్యక్తులు కూడా టీడీపీ సభ్యులతో కలిసి రావడంపై తమ్మినేని అభ్యంతరం తెలిపారు. 

బయటి వ్యక్తులు అసెంబ్లీ ప్రాంగణంలోకి ఏ విధంగా వస్తారని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా వచ్చిన వారిపై  క్రిమినల్ కేసును పెట్టాలని తమ్మినేని సీతారాం అధికారులను ఆదేశించారు. వీడియో ఆధారంగా సభ్యులను కానివారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. మార్షల్స్ తో దురుసుగా ప్రవర్తించడం ఏమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తనకు ఎవరిపై దురుద్దేశం లేదని వెల్లడించారు. సభ్యులంతా హుందాగా ఉండాలని సూచించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పశ్చాతాపం ప్రకటించాలని సూచించారు. విధి నిర్వహణలో భాగంగానే మార్షల్స్ అలా ప్రవర్తించారని చెప్పారు.