టాలీవుడ్‌లో గంజాయి.. 190 కేజీలతో పట్టుబడ్డ అసిస్టెంట్ డైరెక్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

టాలీవుడ్‌లో గంజాయి.. 190 కేజీలతో పట్టుబడ్డ అసిస్టెంట్ డైరెక్టర్

April 18, 2022

cinema

హైదరాబాద్‌, టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు కలకలం రేపగా, డ్రగ్స్ కంటే గంజాయి ఎక్కువగా వాడుకలో ఉందనిపించేలా ఈ ఘటన ద్వారా తెలుస్తోంది. సినీ ఆర్టిస్టులకు గంజాయి సరఫరా చేసే అసిస్టెంట్ డైరెక్టర్‌ను సోమవారం పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇప్పటి వరకు తెలిసిన వివరాల ప్రకారం.. హాథీరామ్ అనే వ్యక్తి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కురుక్షత్రం, యుద్దం శరణం గచ్ఛామి వంటి సినిమాలకు పనిచేశాడు.ఆ సమయంలో కొందరు సినీ తారలకు ఉన్న గంజాయి అలవాటు తెలుసుకొని తనే సప్లయర్‌గా మారాడు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం నుంచి కారులో గంజాయి తరలిస్తుండగా, రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. అతనితో పాటు ఉన్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి, 190 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి తప్పించుకున్నాడు. ఇదిలా ఉండగా, డ్రగ్స్ కేసు నిందితుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు వారిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. నాలుగు రోజుల కస్టడీలో నిందితులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదని సమాచారం.