మీటూ ఉద్యమంలో మరో సంచలనం. సినీ దర్శకులు, పత్రికా సంపాదకులు, కార్పొరేట్ మేనేజర్ల కామపైత్య కథల్లోకి ప్రముఖ యోగా, ఆధ్యాత్మిక గురువు కూడా చేరిపోయాడు. అష్టాంగ యోగ వ్యవస్థపాకుడు శ్రీకృష్ణ పట్టాభి జోయిస్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని మాజీ శిష్యురాళ్లు ఆరోపించారు. ఒక బాధితురాలు ఫొటోలను కూడా బయటపెట్టింది.
పట్టాభి ..యోగా శిక్షణ పేరుతో తనపై అఘాయిత్యాలకు పాల్పడేవాడని కరెన్ రైన్ అనే అమెరికన్ మహిళ వెల్లడించింది. 1990 దశకం మధ్యలో మైసూరులో తాను యోగా శిక్షణ తీసుకున్నానని ఆమె తెలిపింది. ‘యోగా పేరుతో అతడు నాపై పడేవాడు. తన అంగాన్ని నా పొట్ట కింద ఉంచి రుద్దేవాడు. నా పిరుదుపైనా రుద్దేవాడు. నేను ప్రతిఘటించబోతే యోగా అని చెప్పేవాడు’ అని ఆమె తెలిపింది.
ఆ ఫొటోలు చూస్తే తాను అంగీకరించినట్లు కనిపిస్తోందని, అయితే అప్పట్లో ఈ విషయాన్ని భయటపెడితే తలెత్తే పర్యవసానాలకు భయపడి నిజం చెప్పలేదని పేర్కొంది. అతని వేధింపులు భరించలేక యోగాను వదిలేశానంది. పట్టాభి ఇప్పుడు లోకంలో లేడు. 93 ఏళ్ల వయసులో 2009లో చనిపోయాడు. పాప్ గాయని మనోడా వంటి సెలబ్రిటీలకు అతడు గురువు. అతడు తనపైనా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అన్నెక్ లూకాస్ అనే మరో అమెరికన్ మహిళ రెండేళ్ల కిందట చెప్పింది.