పిల్లి విశ్వాసం..పిల్లాడిని కాపాడింది...వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లి విశ్వాసం..పిల్లాడిని కాపాడింది…వీడియో వైరల్

November 9, 2019

పెంపుడు జంతువుగా ఎక్కువగా కుక్కలను పెంచుకుంటారు. కుక్కలు విశ్వాసంగా ఉంటాయని నమ్ముతారు. కానీ, పిల్లులను పెంచుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. పిల్లులను కొందరు అపశకునంగా కూడా భావిస్తారు. కానీ, కొలంబియాలో జరిగిన ఓ ఘటన చూస్తే పిల్లులకు కూడా విశ్వసం ఉంటుందని నమ్మకం కలుగుతుంది. దీంతో వాటిని కూడా పెంచుకోవాలని కోరిక పుడుతుంది.

సామ్యూల్ లియోన్ అనే ఏడాది వయసున్న పిల్లడిని ఓ గదిలో తొట్టిలో వదిలేసి ఇంట్లోని వాళ్ళు ఎవరిపనుల్లో వారున్నారు. ఆ పిల్లాడు ఆడుకుంటూ ఆడుకుంటూ తొట్టిలోనుంచి కిందికి దిగి మెట్లవైపుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న పిల్లి సామ్యూల్‌ని చూసి.. పరిగెత్తుకెళ్లి మెట్లవైపుకు వెళ్లకుండా అడ్డుకుంది. సామ్యూల్‌ని ప్రమాదం నుంచి రక్షించింది. ఈ దృశ్యమంతా సీసీటీవీలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లులను అసహ్యించుకునే వారికి ఈ వీడియో చూపించండంటూ కామెంట్లు చేస్తున్నారు.