కొందరు సినీ తారల పెళ్లిపై ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతకంలో గురువు నీచ స్థానంలో ఉన్న వాళ్లకు పెళ్లి అచ్చిరాదని, ఒకవేళ పెళ్లి చేసుకున్నా తర్వాత ఆ జంట విడిపోతారని హెచ్చరించారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేశ్ శివన్‌లు పెళ్ళి చేసుకోబోతున్నారన్న వార్తల నేపథ్యంలో వేణు స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆయన అభిప్రాయం ప్రకారం.. ‘నయనతార పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత ఆమె వైవాహిక జీవితం సవ్యంగా సాగదు. గురువు నీచ స్థానంలో ఉన్నందువల్ల కాపురంలో కలతలు వస్తాయి. అనుష్క, రష్మిక మందన్నాలకు కూడా వైవాహిక జీవితం సవ్యంగా ఉండదు. జాతకం ప్రకారం ఈ ముగ్గురి సినీ కెరీర్ 2024లో ముగిసిపోతుంద’ని వ్యాఖ్యానించారు. కాగా, వేణు స్వామి గతంలో సమంత గురించి కూడా ఇలాగే చెప్పారు. సమంత పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులకే భాగస్వామి నుంచి విడిపోతుందని జోస్యం చెప్పారు. కొంతకాలానికి సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. ఆయన చెప్పినట్టే జరగడంతో ప్రస్తుత వ్యాఖ్యలు సీనీ పరిశ్రమతో పాటు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.