‘రాసి పెట్టుకోండి.. అల్లు అర్జున్ ఓ బంగారు బాతు’ - MicTv.in - Telugu News
mictv telugu

‘రాసి పెట్టుకోండి.. అల్లు అర్జున్ ఓ బంగారు బాతు’

April 4, 2022

 bbdfb

ఉగాది సందర్భంగా ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి పలువురు టాలీవుడ్ స్టార్ల జాతకాల గురించి వ్యాఖ్యానాలు చేశారు. ఆయన మాటల్లో.. ‘ నన్నందరూ సినిమా హీరోల గురించి ఎందుకు మాట్లాడుతారు అని ప్రశ్నిస్తుంటారు. పబ్లిక్ లైఫ్‌లో ఉన్న వాళ్ల గురించి అందరూ మాట్లాడతారు. అది సాధారణమే. ఈ ఏడాది ఇద్దరు అగ్రహీరోల గురించి సంచలన వార్తలను వింటారు. వారి పేర్లు చెప్పను. అలాగే టాలీవుడ్‌లో మంచి జాతకం ఉన్న హీరో అల్లు అర్జున్. రాబోయే ఐదేళ్ల వరకు ఆయనకు తిరుగులేదు. ఆయన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై కనీసం రూ. 200 కోట్లు వసూలు చేస్తాయి. రాసి పెట్టుకోండి. ఇంకా అంకెలు పెరుగుతాయి తప్ప తగ్గవు. తెలుగు సినిమాకు ఆయన ఓ బంగారు బాతులాంటి వారు.’ అని వెల్లడించారు. కాగా, పై వ్యాఖ్యలను కొందరు లైట్ తీస్కుంటుంటే.. మరికొందరు తమ అభిమాన హీరో భవిష్యత్తు గురించి, సాధించబోయే రికార్డుల గురించి చర్చించుకుంటున్నారు.