చందమామపై వ్యోమగాముల కుప్పిగంతులు.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

చందమామపై వ్యోమగాముల కుప్పిగంతులు.. వీడియో వైరల్

June 10, 2022

కుప్పిగంతులు భూమ్మీద వేస్తారు కానీ చందమామపై సాధ్యమా అంటే ఈ వీడియో చూస్తే సాధ్యమేననిపిస్తుంది. చంద్రుడిపై మానవులు తొలిసారి 1969లో అడుగుపెట్టగా, చివరిసారి అపోలో మిషన్‌లో 1972లో చందమామపై వ్యోమగాములు తిరిగారు. అక్కడికి చేరుకున్నాక చందమామపై ఉన్నామన్న సంతోషంతో ఆగలేక కుప్పిగంతులు వేశారు. గెంతడం, పరుగెత్తడం, నడుస్తూ పడిపోవడం, శూన్యంలో తేలిపోవడం వంటివి చేశారు. చందమామపై మనిషి బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ సాధ్యమయ్యాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, లక్షల మంది చూస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి.