స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. - MicTv.in - Telugu News
mictv telugu

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్..

July 8, 2017

ఆసుస్ వినియోగదారులకు తీపికబురు. జియోతో చేతులు కలిపిన ఆసుస్ ఎంపిక చేసిన తమ సంస్థ స్మార్ట్‌ఫోన్లపై 100 జీబీని అదనపు డేటాను ఉచితంగా ఇస్తుంది. జెన్‌ఫోన్ సెల్ఫీ, జెన్‌ఫోన్ మ్యాక్స్, జెన్‌ఫోన్ లైవ్, జెన్‌ఫోన్ గో 4.5 ఎల్‌టీఈ, జెన్‌ఫోన్ గో 5.0 ఎల్‌టీఈ, జెన్‌ఫోన్ గో 5.5 ఎల్‌టీఈ, జెన్‌ఫోన్ 2, జెన్‌ఫోన్ 2 లేజర్, జెన్‌ఫోన్ 2 లేజర్ 5.5, జెన్‌ఫోన్ 3ఎస్ మ్యాక్స్, జెన్‌ఫోన్ 3 లేజర్, జెన్‌ఫోన్ 3 మ్యాక్స్ 5.2, జెన్‌ఫోన్ 3 మ్యాక్స్ 5.5, జెన్‌ఫోన్ జూమ్, జెన్‌ఫోన్ 3 డీలక్స్, జెన్‌ఫోన్ 3 అల్ట్రా, జెన్‌ఫోన్ 3 5.2, జెన్‌ఫోన్ 3 5.5 ఫోన్లపై ఈ అదనపు డేటా వర్తిస్తుందని ఆసుస్ పేర్కొంది. జూన్ 16వ తేదీ నుంచి ఆసుస్ ఫోన్లు కొన్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని అంటోంది.