పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్లినప్పుడు కొన్ని నియమాలు పాటించి తీరుతాం. అయితే ఒక కంటెంట్ సృష్టికర్త హై- ఎండ్ రెస్టారెంట్ లో కేవలం రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల బిళ్లలతో బిల్లును కట్టేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నది. సిద్దేష్ లోకారే ఒక కంటెంట్ క్రియేటర్. అతను వింత వింత వీడియోలు చేస్తూ ఎప్పుడూ నెట్టింట వైరల్ అవుతుంటాడు. ఇప్పుడు కూడా ఒక కొత్త ప్రయోగం చేశాడు. మామూలుగా హాటల్స్ కి వెళ్లినప్పుడు సైలెంట్ గా ఉండాలి, స్పూన్లు, ఫోర్క్స్ తో తినాలి. బిల్లు కట్టాక వెయిటర్ కి టిప్ ఇవ్వడం ఇలాంటివి చేస్తాం. కానీ సిద్దేష్ ఒక ప్రయోగం చేశాడు.
వీడియోలో..
సిద్దేష్ కి ఆకలిగా అనిపించింది. అటు, ఇటు చూస్తుంటే ఎదురుగా తాజ్ ప్యాలెస్ కనిపించింది. మరి అంత పెద్ద హోటల్ కి వెళ్లినప్పుడు సూటు, బూటు తో వెళ్లాలని అనుకున్నాడు. లోపలికి వెళ్లి మెనూ తీసుకున్నాడు. అక్కడ రగ్దా పూరీ రూ.800 రూపాయలని చెప్పాడు. కాసేపటికి టేబుల్ మీదకు ఒక పిజ్జా, మాక్ టెయిల్ వచ్చేశాయి. హాయిగా చేతితో చక్కగా లాగించేశాడు. ఆ తర్వాత బిల్లు తెమ్మని వెయిటర్ ని పిలిచాడు. బిల్లు చూసి వెంటనే బ్యాగులో నుంచి ఒక కవరు తీసి కాయిన్స్ లెక్కించడం మొదలు పెట్టాడు. చుట్టూ ఉన్నవారంత సిద్దేష్ ని వింతగా చూడడం ప్రారంభించారు. చివరగా వెయిటర్ రాగానే.. ‘చిల్లర పార్టీ’ అంటూ నవ్వేశాడు సిద్దేష్. ముందుగా కాస్త కంగారు పడిన వెయిటర్.. ‘లెక్కించడానికి సమయం పడుతుంది’ అంటూ ఆ మూటను తీసుకెళ్లాడు. ఆ తర్వాత కాసేపటికి వంట గదిలో చిల్లర లెక్కపెట్టే సౌండ్ వినిపిస్తుంటుంది.
చివర మాటలు..
ఈ వీడియో ద్వారా సిద్దేష్ ఒక ప్రయోగం చేశానంటూ ముగించాడు. ‘అంతేకాదు.. మనం చుట్టుపక్కల వాళ్లు ఏమంటారని ఒక డెకోరమ్ ఆధారంగా కొన్ని లేయర్లను ధరించడంలో బిజీ అయిపోయాం. వాటి నుంచి బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. మీరు ఎవరు అనే దాని గురించి మీరే ఆలోచించుకోవాలి. మీరు ఎలా ఉండాలనేది ఇతరులు కాదు.. మీరేమంటనుకున్నారో తెలుసుకోండి’ అంటూ మరో వీడియోతో మన ముందుకు వస్తానంటూ సిద్దేష్ చెప్పకనే చెప్పాడు. దీని గురించి పలువురు పాజిటివ్ గా కామెంట్ చేయడం విశేషం. ఈ వీడియో ఇప్పటికి 1.2 మిలియన్ వ్యూస్ కి చేరుకుంది.