At the age of 20, he used it all and left it
mictv telugu

20ఏళ్లకే మొత్తం వాడుకుని వదిలేశాడు

November 22, 2022

ఆండ్రియా.. ఒక మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీ. స్టార్ సింగర్, స్టార్ హీరోయిన్ గా తమిళంలో ఆండ్రియాకి మంచి క్రేజ్ ఉంది. స్టోరీపై కూడా ఆండ్రియాకి గ్రిప్ ఎక్కువ అంటారు. మరి అంతటి విలక్షణతలున్న ఆండ్రియాని ఒక వ్యక్తి దారుణంగా మోసం చేశాడట. 20ఏళ్ళ వయసులోనే తనని వాడుకుని అవసరం తీరక వదిలేసి మోసం చేశాడట. ఈ విషయాన్నీ ఆండ్రియానే స్వయంగా బయటపెట్టింది. ఒక వ్యక్తిని నమ్మి 20ఏళ్ళ వయసులోనే సహజీవనం చేస్తే, వాడు మోసం చేశాడని వాపోయింది. ప్రతి మనిషి జీవితంలో ఉండే చేదు జ్ఞాపకాలు తన లైఫ్ లోను ఉన్నాయని.. తనకి దారుణమైన బ్రేకప్ ఉందని వెల్లడించింది. సహజంగా సినిమా స్టార్స్ అందరికి సాఫ్ట్ టార్గెట్ అవుతారు. బాడీ షేమింగ్, పర్సనల్ అటాక్ వారిపై ఎక్కువగా ఉంటుంది. అలానే వారు ఇతరుల చేతిలోను మోసపోతూ కూడా ఉంటారు. కొందరు అవి మర్చిపోయి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే మరికొందరు మోసాన్ని భరించలేక తనువు చెల్లిస్తారు.

అయితే తాను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మోసం చేసినప్పుడు నేను ధైర్యంగానే ఉన్నానని, త్వరగానే డిప్రెషన్ నుండి బయటపడ్డానని చెప్పుకొచ్చింది ఆండ్రియా. అయితే ఆండ్రియా ఎవరి చేతిలో మోసపోయింది.. అనే వివరాలు మాత్రం బయటికి చెప్పలేదు. 20 ఏళ్లకే ఆ చేదు అనుభవం ఎదురయ్యే సరికి ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ, ఎవరినీ ప్రేమించలేదని చెప్పింది. అలాగే తనకు పెళ్లిపై కూడా ఎలాంటి ఆసక్తి, ఆలోచన లేవని.. పెళ్లి చేసుకున్న ఆడవాళ్లు ఆనందంగా లేరనేది తన పర్సనల్ అభిప్రాయమని షాకిచ్చింది ఆండ్రియా. అయితే తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ చేతిలోనే ఆండ్రియా మోసపోయిందని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. చాన్నాళ్లు ఆండ్రియా అనిరుధ్ తో డేటింగ్ చేసిందని.. అతను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాకా ఆండ్రియని పక్కన పెట్టేశాడని అంటున్నారు. ఇక ఆండ్రియా చేతిలో పిశాచి 2, కా, మాళిగై, నో ఎంట్రీ.. వంటి సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.