At time in four diveses-whatsapp new feature
mictv telugu

ఒకేసారి నాలుగు డివైస్లలో.. వాట్సాప్ కొత్త ఫీచర్

November 15, 2022


వాట్సాప్‌ (WhatsApp ) మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఒకే నంబర్‌తో ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్లతో పాటు.. మరో రెండు డివైస్‌లలో వాట్సాప్‌ను యాక్సెస్‌ చేసుకోవడానికి యూజర్లకు అనుమతినివ్వనుంది. ఈ సేవను ఎనేబుల్ చేసేలా ‘కంపానియన్ మోడ్ (companion mode)’ అనే ఫీచర్‌ని త్వరలోనే తీసుకురానుంది.

వాట్సాప్ రాబోయే ఫీచర్లను ట్రాక్ చేసే వాబేటా ఇన్ఫో ప్రకారం.. కంపానియన్ మోడ్‌ (companion mode) ఫీచర్‌ను కొన్ని బీటా టెస్టర్‌లకు విడుదల చేసింది. ఇక్కడ టెస్టర్లు వాట్సాప్ కొత్త ఫీచర్ ను టెస్ట్ చేస్తున్నారు. ఈ కొత్త ఫీచర్ వస్తే కనుక ‘లింక్ డివైస్’ ఆప్షన్ తో రెండో స్మార్ట్‌ఫోన్‌ను లింక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఉన్నది కాకుండా మరొక స్మార్ట్‌ఫోన్‌ను లింక్ చేసిన తర్వాత, చాట్ హిస్టరీ చూడటం తోపాటు, మెసేజేస్‌ చూసుకోవడం, సమాధానాలివ‍్వడం, కాల్స్‌ను కూడా చేసుకోవచ్చట. దీంతో రెండు స్మార్ట్‌ఫోన్‌లు, ఒక టాబ్లెట్ , ఒక డెస్క్‌టాప్‌కి వాట్సాప్ లింక్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం క్యూఆర్‌ కోడ్ స్కానింగ్ ద్వారా డెస్క్‌టాప్‌లో వాట్సాప్‌ సేవలను పొందుతున్న సంగతి తెలిసిందే. వాట్సాప్‌కు భారతదేశంలో దాదాపు 500 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు.

మొన్ననే వాట్సాప్ గ్రూప్‌లో పాల్గొనే వారి సంఖ్యను 1024కి పెంచిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీస్‌ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఒక గ్రూపు.. మరికొన్ని గ్రూపులను రూపొందించడానికి యూజర్లకు అనుమతిస్తుంది. ఇందులో ఒక గ్రూపు గరిష్టంగా 12 గ్రూపులను క్రియేట్‌ చేసుకోవచ్చు. ఇదే క్రమంలో ‘కంపానియన్ మోడ్ (companion mode)’ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.