ఆట పాట లాపట.. ఈనాడు అత్తర బిత్తర తత్తర - MicTv.in - Telugu News
mictv telugu

ఆట పాట లాపట.. ఈనాడు అత్తర బిత్తర తత్తర

April 14, 2018

“ఆట పాట లాపట” తెలుగు లెక్కనే కనిపిస్తూ, ఆల్ మోస్ట్ తెలుగు లెక్కనే వినిపిస్తున్న ఈ పదాలకు, పదబంధానికి నిజానికి తెలుగు భాషతో అస్సలు సంబంధమే లేదు. మరి ఇవి ఏ భాషా పదాలు అనుకుంటున్నారా? ఇప్పటికైతే ఇవి ఏ భాషవో ఏ భాషాపండితుడూ కనిపెట్టలేకపోవచ్చు. మరి ఈ వింతాంతివింత పదబంధం ఎక్కడిదో తెలుసా?  రోజుకో కొత్త తెలుగు పదానికి బలవంతంగా పురుడు పోస్తున్న “ఈనాడు” క్షుద్ర అనువాదానికి పుట్టిన వింత పదం ఇది.

మ్యాటర్ ఏంటంటే బాలీవుడ్ కమెడీయన్ రాజ్ పాల్ యాదవ్‌ను ఓ లావాదేవీ కేసులో ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. దీనిపై ఈనాడు వెబ్ పేజీలో ఓ వార్త వచ్చింది. అందులో రాజ్ పాల్ యాదవ్ నటించిన మొదటి బాలీవుడ్ చిత్రం ‘ఆట పాట లాపట’ అని రాశారు. నిజానికి ఆ సినిమా పేరు “అతా పతా లాపతా” ఇంగ్లీష్‌లో Ata Pata Laapata అని రాస్తారు. అడ్రస్ లేకుండా పోయాడని చెప్పడానికి హిందీలో అతా పతా లాపతా నానుడి వాడతారు. ఈ వార్తలను అనువదించిన వారికి ఈ సంగతి తెలియకపోవడంతో ఉన్నది ఉన్నట్టు అనువధించారు.

అనువాదకుడికి అన్ని భాషల్లో పట్టు ఉండాలనే షరతేమీ లేదుగాని.. ఇలాంటి టెక్నికల్ విషయాలు తెలిసి ఉండాలి. ఈ సినిమా కథేందో తెలుసుకుని ఉంటే ‘అతా పతా..’ అనే సినిమా ఒకటి ఉందని, దాన్ని అలా పలుకుతారని తెలిసేది. కానీ ఇంగ్లిష్ లో ఉన్న పదాలను యాజిటీజ్‌గా తెలుగు చేయడంతో తేడా కొట్టేసింది. ఇక ఈ వార్త చదివిన నెటిజన్లు ఈనాడు భాషపై జోకులు వేసుకుంటున్నరు.