కలికాలం.. వీరనాస్తిక వర్మ గుళ్లూగోపురాల చుట్టూ..   - MicTv.in - Telugu News
mictv telugu

కలికాలం.. వీరనాస్తిక వర్మ గుళ్లూగోపురాల చుట్టూ..  

October 19, 2018

వివాదాలకు పెట్టింది పేరు దర్శకుడు రాంగోపాల్ వర్మ. తాను నాస్తికుడినని చెబుతుంటాడు. హిందూదేవుళ్లను తిడుతుంటాడు. ఆచారాలను గేలి చేస్తుంటాడు. అయితే హఠాత్తుగా  ఏమైందో ఏమోగాని నిన్నటి నుంచి గుళ్లూగోపురాలు పట్టుకుని తిరుగుతున్నాడు. నిన్న కాణిపాకం వరసిద్ధి వినాయకుణ్ని దర్శించున్న ఆర్జీవీ ఈ రోజు పొద్దున తిరుమల వెంకనన్ను దర్శించుకున్నాడు. ఏదీ దాచిపెట్టని వర్మ దీనిపై సోషల్ మీడియాలో పోస్టాడు కూడా.

tt

‘‘నాస్తికుడినైన నేను నా జీవితంలో మొట్టమొదటి సారిగా అక్టోబర్ 19 పొద్దున్న 6 గంటలకి తిరుపతి లో బాలాజీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని సాయంత్రం 4 గంటలకి తిరుపతి శిల్పారామం లో ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మి’స్ ఎన్టీఆర్ వివరాలు చెప్పబోతున్నాను” అని తెలిపారు.

ఎన్టీఆర్ చివరిదశను వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో సినిమాగా మలుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన తిరుపతిలో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతిని కలుసుకున్నారు. కాగా, వర్మతో కాణిపాకం ఆలయ అధికారులు, దగ్గరుండి పూజలు చేయించి, స్వామివారి చిత్ర పటాన్ని, ప్రసాదాలను అందించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు స్వామివారి వద్దకు ఆశీస్సుల కోసం వచ్చానని, సినిమాను బాగా తీస్తానని వర్మ చెప్పాడు.