రూ. 200 వల్లే ఏటీఎంలలో నోట్ల కొరత! - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 200 వల్లే ఏటీఎంలలో నోట్ల కొరత!

April 17, 2018

ఏడాదిన్నర కిందట దేశాన్ని తలకిందులు చేసిన నోట్ల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఏటీఎంలలో కేలవం 30 శాతం మిషన్లలో మాత్రమే నోట్లు అందుబాటులో ఉన్నాయి. డబ్బాల్లో పెట్టిన వెంటనే ఖాళీ అయిపోతున్నాయి. గతంలో క్యూలు కనిపించగా, ఇప్పుడు ఖాళీ బోర్డులు కనిపిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. డబ్బు కోసం పెళ్లి కార్డులను చూపి మరీ బ్యాంకులను ప్రాధేయపడుతున్నారు.

కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని ప్రాంతాల్లో నగదుకు ఉన్నట్టుండి డిమాండ్ పెరగడం వల్ల నగదుకు కొరత ఏర్పడిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అనివార్య కారణాల సంగతేమోగాని, కొత్తగా తీసుకొచ్చిన రూ. 200 నోట్లు కూడా సమస్యకు కారణం అని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. 200 నోట్లను ఏటీఎంలలో పెట్టేందుకు ఇంకా రీకాలిబరైజేషన్ ప్రక్రియ పూర్తి కాలేదని, వారికోసం అరల సైజులను మార్చాల్సి ఉందని అంటున్నారు.  హైదరాబాద్, భోపాల్, సూరత్, వారణాసి, పాట్నా, నోయిడా, ఢిల్లీ, చెన్నై తదితర నగరాల్లో ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని చెబుతున్నారు.