విశాఖలో ఏటీఎంల కాల్చివేత.. నోట్లు బుగ్గి - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖలో ఏటీఎంల కాల్చివేత.. నోట్లు బుగ్గి

March 31, 2020

Atm center ablaze in Araku valley Andhra Pradesh lockdown 

కరోనా లాక్‌డౌన్ వల్ల రోడ్లపై జనం కనిపించడం లేదు. కొందరు దీన్ని అవకాశంగా తీసుకుని దోపిడీలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. గతవారం పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్‌గుడిలో ఓ ముసలమ్మపై ఇద్దరు యువకులు అత్యాచారానికి యత్నించగా ఆమె ఓ నీచుడి నాలుకను కొరికి రెండు ముక్కలు చేసింది. గుంటూరులోనూ ఓ బాలికపై అఘాయిత్యం జరిగింది. లాక్‌డౌన్ దొంగలకు కూడా వాటంగా మారింది. ‘

విశాఖపట్నం జిల్లా అరుకులోయలో దొంగలు ఏటీఎంలను టార్గెట్ చేసుకున్నారు. సోమవారం రాత్రి అరకు మెయిన్ రోడ్‌లోని ఇండియా వన్ బ్యాంకు ఏటీఎంను దోచుకోడానికి యత్నించారు. అయితే తలుపులు తెరుచుకోకపోవడంతో సెంటర్‌లో పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. దీంతో ఏటీఎంలు కాలిపోయాయి. నోట్లు కూడా కొన్ని బుగ్గి అయినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.