రూ.500 విత్‌డ్రా చేస్తే.. రూ. 2,500.. ఏటీఎంకు ఎగబడ్డ జనం - Telugu News - Mic tv
mictv telugu

రూ.500 విత్‌డ్రా చేస్తే.. రూ. 2,500.. ఏటీఎంకు ఎగబడ్డ జనం

June 16, 2022

ఓ ప్రైవేటు బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేసిన దానికంటే ఐదు రెట్లు న‌గ‌దు ఎక్కువ‌గా వ‌స్తుండ‌టంతో జ‌నం బారులు తీరారు. ఈ సంఘ‌ట‌న నాగ‌పూర్ జ‌ల్లా ఖాప‌ర్ ఖేడా ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బ్యాంక్ ఏటీఎంలో రూ.500 డ్రా చేయడానికి వెళ్లిన వ్యక్తికి రూ. 2,500 వచ్చాయి. దీంతో ఆయన ఆశ్చర్యపోయి మరోసారి రూ. 500 కోసం ప్రయత్నించాడు. అప్పుడు కూడా మరోసారి ఆయనకు రూ. 2,500 డబ్బులు చేతుల్లోకి వచ్చింది. ఈ విషయం క్షణాల్లో ఊరంతా పాకింది. స్థానికులంతా పరుగున ఏటీఎం ముందుకు వచ్చి చేరారు.

ఏటీఎం ముందు జనం, సందడిని చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు వచ్చి ఏటీఎం మూసేశారు. బ్యాంకుకు ఫోన్ చేసి సమాచారం అందించారు. చాలా మంది ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. బ్యాంకర్లు వచ్చి యంత్రాన్ని పరిశీలించగా లోపం బయటపడింది. ఏటీఎంలో రూ.100 పెట్టాల్సిన ట్రేలో 500 నోట్లను ఉంచడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అందుకే రూ.500 విత్ డ్రా చేసుకున్న వారికి రూ.500 ఐదు నోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.