ప్రజల సమస్యలు తీర్చాలని.. ఏటీఎంను కాల్చేశాడు! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజల సమస్యలు తీర్చాలని.. ఏటీఎంను కాల్చేశాడు!

February 12, 2018

నిరసనలు పలురకాలు.. జనాన్ని ఆకర్షించడానికి ఎన్నో రూపాలు.. ప్రజలకు ఇబ్బంది రానంతవరకు ఫర్వాలేదుగాని శ్రుతిమించితే కటకటాలు ఎదురుచూస్తుంటాయి. ఆకలిచావులు, అసమానతలు పోవాలని, సర్కారు తన డిమాండ్లను తీర్చాలని ఓ యువకుడు ఏకంగా ఏటీఎంకే  తగలబెట్టాడు. హైదరాబాద్ కూకట్ పల్లి ఒకటో ఫేజ్‌లో ఈ సంఘటన జరిగింది.ఆదివారం తెల్లవారుజామున 3.25గంటల సమయంలో వ్యక్తిన ఓ యువకుడు ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు ఏటీఎం యంత్రాన్ని తగులబెట్టాడు. పేలుడు పదార్థాన్ని ఓ కవర్లో ఏటీఎంపై ఉంచాడు. తర్వాత కేబుల్ లాగి నిప్పు పెట్టాడు. దీంతో ఏటీఎం డిస్‌ప్లే, అక్కడి సీసీ కెమేరాలు కాలిపోయాయి. కెమెరాలు ధ్వంసం కాకముందు రికార్డయిన  ఫుటేజీల్లో అతడు కనిపించాడు. అయితే ఏటీఎంలోని నగదు మాత్రం భద్రంగానే ఉండి.

డిమాండ్లు ఇవీ..

దుండగులు 17 పేజీల లేఖను ఘటనా స్థలంలో వదలివెళ్లాడు.  ప్రపంచంలో ప్రజలు ఆకలి, నిరుద్యోగం వంటి ఎన్నో  చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశాడు. ‘ప్రపంచమంతటా ఒకే గుర్తింపుకార్డు ఉండాలి.  కులమత భేదాలు పోవాలి. రిజర్వేషన్లు వద్దు.. ఆకలిచావులను నివారించడానికి  చర్యలు తీసుకోవాలి. విద్య, వైద్యం, శాంతిభద్రతలను మెరుగుపరచి, , పర్యావరణాన్ని పరిరక్షించాలి. మహిళలపై ఆత్యాచారాలను అరికట్టాలి. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలి’ అని డిమాండ్లు పెట్టాడు. తన లేఖను 24గంటల్లోపు మీడియాలో ప్రచురించాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. పోలీసులు అతని కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.