డబ్బు డిపాజిట్ చేయడానికి ఏటీఎం వెళ్తున్నారా? 2 లక్షలు దోచుకున్నారు.. - MicTv.in - Telugu News
mictv telugu

  డబ్బు డిపాజిట్ చేయడానికి ఏటీఎం వెళ్తున్నారా? 2 లక్షలు దోచుకున్నారు..

June 11, 2022

డబ్బు డిపాజిట్ చేయడానికి బ్యాంకుకు వెళ్తే చాలా సమయం పడుతుందని, దగ్గరో ఉన్న ఏటీఎంలో చేసేస్తే త్వరగా పని పూర్తవుతుందని భావిస్తుంటాం. ఈ విషయంలో తగినంత జాగ్రత్తగా ఉండకపోతే అసలుకే మోసం వస్తుంది. ముఖ్యంగా సెక్యూరిటీ గార్డులు లేని, జనసంచారం అంతగా లేని ఏటీఎంల వద్దకు అసలు వెళ్లకూడదు. డబ్బు డిపాజిట్ చేయడానికి వెళ్లిన ఓ యువకుణ్ని దోపిడీ ముఠా కత్తితో బెదిరించి దాదాపు రూ. 2 లక్షల సొమ్ములు దోచుకెళ్లిపోయింది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన సచిన్ చౌరాసియా అనే వ్యక్తి ఓ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంలో రూ.1.91 లక్షలు డిపాజిట్ వెళ్లాడు. బ్యాగు నుంచి నోట్లు తీస్తుండగాచేస్తుండగా ముగ్గురు బందిపోట్లు లోనికొచారు. వారిలో ఒకడు సచిన్‌ను కత్తితో బెదిరించాడు. డబ్బులో మళ్లీ బ్యాగులోనే పెట్టాలని చెప్పాడు. ముగ్గురూ అతణ్ని జడిపించి బ్యాగు లాక్కుని పారిపోయారు. ఈ దృశ్యాలు ఏటీఎంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.