కారులో వచ్చి ఏటీఎం దోచుకెళ్లారు.. మహబూబ్‌నగర్‌లో ఘటన  - MicTv.in - Telugu News
mictv telugu

కారులో వచ్చి ఏటీఎం దోచుకెళ్లారు.. మహబూబ్‌నగర్‌లో ఘటన 

September 30, 2020

NGGNGNGN

దోపిడి దొంగలు ఏటీఎంలను కూడా వదలడం లేదు. సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసినా కూడా తెలివిగా చోరీ చేసుకొని వెళ్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఇలాంటి కేసులు తరుచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో కూడా ఎస్‌బీఐ ఏటీఎంలో దొంగతనానికి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి చొరబడిన దుండగులు రూ. 15 లక్షలతో ఉడాయించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఇద్దరు దుండగులు రాత్రి ఎవరూ లేని సమయంలో ఓ కారులో వచ్చారు. డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నట్టుగా నటించి ఏటీఎంను పగలగొట్టారు. గ్యాస్ కట్టర్ల సాయంతో మిషన్‌ను కట్ చేశారు. ఆ తర్వాత అందులో ఉన్న డబ్బు తీసుకున్నారు. షర్టర్ కిందకు దించి ఏమి తెలియనట్టుగా వెళ్లిపోయారు. చోరీ విషయం బయటపడటంతో బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీని పరిశీలించగా ముఖాలకు మాస్కులు రుమాలు చుట్టు కోవడంతో వారిని గుర్తించడం కష్టంగా మారింది. దొంగల కోసం గాలింపు ముమ్మరం చేశారు.