వీళ్లేం దొంగలు బాబోయ్.. ఏటీఎంనే ఎత్తుకెళ్లారు - MicTv.in - Telugu News
mictv telugu

వీళ్లేం దొంగలు బాబోయ్.. ఏటీఎంనే ఎత్తుకెళ్లారు

June 30, 2020

nvb n

హైదరాబాద్ నగర శివారుల్లో ఉన్న పట్టణాల్లో ఏటీఎంలకు రక్షణ లేకుండా పోతోంది. గతంలో హయత్ నగర్, సంగారెడ్డి ప్రాంతాల్లో ఏటీఎంలను ఎత్తుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌-రామగుండం రహదారిపై ప్రజ్ఞాపూర్‌‌లో కూడా ఇదే విధంగా ఏటీఎంను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇండియా వన్ ఏటీఎం సెంటర్‌లోని మిషన్‌ను గడ్డపారలతో దాన్ని పెకిలించి తమతో పాటు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకొని దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.  

బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. టీఎంను దొంగలించేందుకు నలుగురు వ్యక్తులు ఆటోలో వచ్చినట్లు గుర్తించారు. చోరీ జరిగిన సమయంలో ఏటీఎంలో 4,98,800 నగదు ఉన్నట్లు నిర్వహకులు తెలిపారు. నగర శివారులలో ఏటీఎం దొంగలు వరుసగా రెచ్చిపోతూ ఉండటంతో ఏదైనా ముఠా వచ్చిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా చోరీ జరిగిన తర్వాత  24 గంటల వరకు కూడా ఎవరూ గుర్తించకపోవడం విశేషం.