ఈనడుమ..పబ్లిక్ ఉషారైన్రనో,లేకపోతే ఆళ్ల దగ్గర పైసలుంటలెవ్వనో కారణం ఏందో తెల్వదిగనీ ఏడ జూశ్న ఏటియంలకే సూటి వెడ్తున్రు దొంగతనం జేశెటోల్లు,చాలా చోట్ల ఏటియం దొంగతనాలు తెల్శినయే….
మెల్లెగ అర్ధరాత్రి ఎవ్వలు లేంది జూశి స్కూడ్రైవర్లు వట్కచ్చి తిప్పలవడి తిప్పలవడి ఏటియం మిషన్ ఏడికాడ్కి వలగ్గొట్టి ఏటియంలున్న పైసలన్ని లావట్కపోతరు.కనీ గవన్ని తిప్పలెందుకనుకున్రో ఏమో రాజస్ధాన్ దొంగలు..
ఏటియంల పెట్టకముందే పైసల్ లావట్కవోతే ఖేల్ ఖతం అనుకున్నట్టున్నరు, ఇగేముంది స్కెచ్ ఎయ్యనే ఏశిన్రు…
రాజస్ధాన్ లోని భిల్వారాలో ఏటీయంల వెట్టనీకనీ బ్యాంకుల పైసల్ నింపుకొని వోతున్న వ్యాన్ ను ఎవ్వలులేని దగ్గర ఆపి ..డ్రైవర్ను బెదిరిచ్చి 57 లక్షలు ఎత్కపోయిన్రట,డ్రైవర్ లబ లబ మొత్తుకుంట పోలీస్ స్టేషన్ల కొయ్యి కంప్లైంట్ జేశిండట.పోలీసోళ్లు గ దొంగలను దొర్కవట్టే పనిలున్నరట.కనీ ఈనడుమ దొంగలుగుడ దొంగతనం జేశుట్ల ఏమన్న ఉషారుతనం జూపిస్తున్రా..పక్కా ప్రణాళికలు ఏస్కొని..దొంగతనం చెయ్యనీకి కొత్త కొత్త టెక్నిక్లను కనివెట్టుతున్నరు,మరి ఆళ్లుగుడ అప్డేట్ అవ్వాలే గదా.