ATM washed away in flood
mictv telugu

24 లక్షలతో వరదల్లో కొట్టుకుపోయిన ఏటీఎం.. వీడియో

August 12, 2022

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఆ ధాటికి ఇప్పటికే పలు చోట్ల వంతెనలు, రోడ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా ఓ ఏటీఎం వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. అంతకు కొద్ది ముందుగా బ్యాంకు అధికారులు అందులో రూ. 24 లక్షలు జమ చేశారు. ఏటీఎం నదిలో కొట్టుకుపోయే సమయానికి అందులోంచి ఎంత డబ్బు విత్ డ్రా చేశారనే వివరాలు ఇంకా తెలియలేదు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలో ఈ ఘటన జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో అక్కడి కుమోలో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది ఒడ్డునే పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉండగా, ఏటీఎంతో సహా ఎనిమిది దుకాణాలు కొట్టుకుపోయాయి. దీనిని అక్కడి స్థానికులు కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు వీడియోను చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.