ఏటీఎమ్ నోట వంద పాట ! - MicTv.in - Telugu News
mictv telugu

ఏటీఎమ్ నోట వంద పాట !

August 10, 2017

ఈ దీపావళి పండగకు ఎవరు షాపింగ్ చెయ్యాలన్నా వాళ్ళకీసారి ఏటిఎమ్ లు సాద్దారి ఇయ్యయట. ఎందుకంటే ఏటిఎమ్ ల నుండి 500, 2,000 నోట్లు రావంట. అన్నీ 100 నోట్లే వస్తయంట. ఏటీఎమ్ నోట వంద పాట.. నిజం ఇది. బ్లాక్ మనీ దెబ్బతోని, పాత నోట్ల రద్దుతోని ఒక్కసారి నోట్లకు చాలా ఇబ్బంది ఏర్పడింది. ఆ మధ్య ఏటిఎమ్ ల దగ్గర జనాలు ఎన్ని లైన్లుగా నిలబడేదో మన కళ్ళ ముందు నుండి ఇంకా సమసిపోలేదు. మోడీ ప్రభుత్వం రాకతో నోట్ల గలాట చాలా జరుగుతోందని జనాలు భావిస్తున్నారు. ఇప్పుడు తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల మేరకు ఏటిఎమ్ ల నుండి ఈ అక్టోబర్ ప్రారంభం నుండి వంద నోట్లే వస్తాయట.

వర్సగా వచ్చిన 500, 2,000 వేల నోట్లతో చిల్లరకు జనాలకు చాలా ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. ఆన్ లైన్ పేమెంట్లు వున్న కారణంగా నగరాల వంటి ప్లేసుల్లో నడిచిపోయింది గానీ పల్లెల్లో పెద్ద నోట్ల వల్ల చిల్లర కోసం జనాలు చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారు. పైగా ఈ పెద్ద నోట్లను తీసినవాళ్లు దాచుకోవడంతో నోట్ల కొరత ఏర్పడింది. పైగా పెద్ద నోట్ల ముద్రణ కూడా తక్కువైంది. వంద నోట్ల ముద్రణ రెడీగా వుండటంతో ఈ నిర్ణయం తీస్కుంటున్నట్టు ఆర్ బీఐ తెలిపింది. ఇక చిల్లర కోసం ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం వుండదేమో.