Home > Featured >  ఏటీఎం నుంచి విత్‌డ్రా రోజుకు ఒకసారే!

 ఏటీఎం నుంచి విత్‌డ్రా రోజుకు ఒకసారే!

ATM ...

ఏటీఎం కార్డు జేబులో ఉంది కదా అని ఎప్పుడంటే అప్పుడు నగదు డ్రా చేద్దామనుకుంటే ఇక ముందు కుదరదు. కనీసం 6 నుంచి 12 గంటల సమయం గ్యాప్ ఉంటేనే డబ్బు తీసుకునేలా ఓ ప్రతిపాదనను బ్యాంకర్లు స్క్రీన్‌పైకి తీసుకొచ్చారు. ఢిల్లీ స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఈ కొత్త నిబంధన చర్చకు వచ్చింది. దీనికి ఆమోదం లభిస్తే త్వరలోనే ఢిల్లీ అంతటా డిబిట్ కార్డు వినియోగానికి షరతులు వర్తించనున్నాయి. దీంతో ఏటీఎం ద్వారా నగదును ఒకసారికి మించి విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండదు.

బ్యాంక్, ఏటీఎం మోసాలు పెరుగుతున్నతరుణంలో వాటిని నివారించేందుకు ఇటువంటి నిర్ణయానికి వచ్చినట్టు బ్యాంకర్లు వెల్లడించారు. ఇలాంటి మోసాల్లో మహారాష్ట్ర ముందు వరుసలో ఉండగా, ఢిల్లీ రెండో వరుసలో ఉంది. దీంతో మోసాలకు చెక్ పెట్టాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.దీంతో పాటు ఏటీఎం సెంటర్‌లో హెల్మెట్ పెట్టుకొని డబ్బు డ్రా చేయాలనుకున్నా అవకాశం లేకుండా టెక్నాలజీని అభివృద్ధి చేశారు. కాగా ఇప్పటికే డెబిట్ కార్డు మోసాల నుంచి బయటపడేందుకు యోనో యాప్ అందుబాటులోకి తెచ్చింది. కెనరా బ్యాంకు రూ. 10 వేలకు మించితే ఓటీపీ ఎంటర్ చేయాలనే నిబంధన తీసుకువచ్చింది.

Updated : 27 Aug 2019 5:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top