Atm withdrawals limit waive off 
mictv telugu

కరోనాలో గుడ్‌న్యూస్.. విత్‌డ్రాల పరిమితి ఎత్తివేత

March 24, 2020

265251

కరోనాతో దేశం మూతపడింది. ఇళ్ల నుంచి జనం బయటికి రావడం లేదు. కానీ బతుకు పోరాటం కోసం ఆహారం, వైద్యం, ఇతర అవసరాలు తీర్చుకోవాల్సిందే. అందుకు డబ్బు ఉండాల్సిందే. అన్నిచోట్లా డిజిటల్ చెల్లింపులు మనదేశంలో ఇప్పట్లో సాధ్యం కాదు కాబట్టి నోట్లు కావాల్సిందే. ఏటీఎంను ఆశ్రయించాల్సిందే. అయితే కరోనా కాలంలో ఆ యంత్రాలు పనిచేస్తాయన్న గ్యారంటీ లేదు. మామూలుగానే క్లోజ్ బోర్డులో కనిపించే ఏటీఎంల విషయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం కాస్త వెలుసుబాటు కల్పించింది. 

కరోనా నేపథ్యంలో వచ్చే మూడు నెలల పాటు ఏటీఎం విత్ డ్రాయల్స్‌పై పరిమితులను ఎత్తేస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే సేవింగ్ బ్యాంక్ అకౌంట్లలో మినిమం బ్యాలన్స్ నిబంధనను కూడా ఎత్తేస్తున్నామని వెల్లడించింది. జీఎస్టీ రిటర్న్స్ దాఖలు గడువును కూడా జూన్ 30 వరకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 5 కోట్ల టర్నోవర్ లోపు ఉన్న కంపెనీలకు ఎలాంటి లేట్ ఫీజు, జరిమానా, వడ్డీ లేకుండానే రిటర్న్స్ స్వీకరిస్తామని వివరించారు.