ఆత్మ నిర్భర్ ఇదే.. మిలటరీ కేంటీన్లలో మేడిన్ ఇండియా ఫుడ్డే
కరోనా లాక్‌డౌన్ నుంచి గుణపాఠాలు నేర్చుకుని ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న పిలుపిచ్చారు. ఆత్మ నిర్భయ్ (స్వావలంబన) కోసం ప్రజలు కష్టపడాలని, దేశీయ ఉత్పత్తులు పెంచాలని కోరారు. ఈ రోజు దీన్ని ఆచరణలో పెడుతూ కేంద్రం దేశీయ ఆహార పరిశ్రమలకు మేలు చేసే నిర్ణయం తీసుకుంది. ఇకపై పారామిలటరీ బలగాల కేంటీన్లలో మేడిన్ ఇండియా ఉత్పత్తులనే అమ్మాలని ఆదేశాలు జారీచేసింది.
బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర సాయుధ బలగాలు నిర్వహించే కేంటీన్లలో దేశీయ ఆహారోత్పత్తులను అందుబాటులో ఉంటాయని హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. జూన్1 నుంచి పదిలక్షల జవాన్లక కుటుంబాల్లోని అరకోటి కుటుంబ సభ్యులు వీటిని కొనుగోలు చేస్తారు. మోదీ పిలుపు మేరకు ఆర్థిక స్వావలంబన కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన ట్విటర్లో తెలిపారు. దేశీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రజలు కూడా సాధ్యమైనన్ని స్థానిక ఉత్పత్తులనే వాడాలని కోరారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం కింది రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలను మంత్రి నిర్మలా సీతారాన్ వెల్లడిస్తారు.