వ్యవసాయం కోసం లక్ష కోట్లు.. కేటాయింపులు ఇలా... - MicTv.in - Telugu News
mictv telugu

వ్యవసాయం కోసం లక్ష కోట్లు.. కేటాయింపులు ఇలా…

May 15, 2020

Nirmala Sitharaman.

కరోనా కష్టకాలంలో వ్యవసాయ రంగ మౌలిక వసతుల కోసం రూ.లక్ష కోట్లతో నిధి ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు వెల్లడించారు.  ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట ఇప్పటికే రూ.20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని రకాల రైతులకు రూ.లక్ష కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు.  వ్యవసాయం, సాగు అనుబంధ రంగాలకు ఊతమిచ్చే చర్యలను ఆమె ప్రకటించారు. లాక్‌డౌన్‌ కాలంలో రైతుల ఖాతాల్లో రూ. 18,730 కోట్లను జమచేయడంతో పాటు రైతుల నుంచి రూ 74,300 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. వ్యవసాయం, మత్స్య, పశుసంవర్ధక, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, డెయిరీ రంగాలకు ఊతమిచ్చేలా ఉద్దీపన ప్రకటించామని వివరించారు.

 

మూడవ విడత ప్యాకేజ్‌ వివరాలు ఇలా…

వ్యవసాయం అనుబంధ రంగాలపై రూ.లక్ష కోట్ల ప్యాకేజ్‌ ప్రకటిస్తూ.. మత్స్య, పశుసంవర్థక ,డెయిరీ , ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు ఊతమిచ్చారు. మూడో విడత ప్యాకేజ్‌లో ముఖ్యంగా 11 అంశాలపై దృష్టి సారించారు.

-కోల్డ్‌స్టోరేజ్‌లు, ధాన్యాల గిడ్డంగుల నిర్మాణం

-రైతుల ఖాతాల్లో రూ 18,700 కోట్ల నగదు బదిలీ

-రూ. 74,300 కోట్ల విలువైన ధాన్యం రైతుల నుంచి కొనుగోలు

-రూ.30 వేల కోట్లతో రైతులకు అత్యవసర సహాయ నిధి (సహాయ నిధితో 3 కోట్ల మంది రైతులకు లబ్ధి)

-రూ 5వేల కోట్లతో  డెయిరీ రైతులకు అదనపు సాయం (2 కోట్ల మంది డెయిరీ రైతులకు లబ్ధి)

-ఆక్వా రైతుల ఎగుమతుల కోసం రూ 11,000 కోట్ల నిధి 

-రూ 10,000 కోట్లతో స్ధానిక ఉత్పత్తుల ఎగుమతులు

-చిన్నతరహా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్ధల కోసం రూ 10,000 కోట్ల నిధి (2 లక్షల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు లబ్ధి)

-మత్స్య అనుబంధ రంగాలకు రూ 20,000 కోట్లు

-మత్స్యకారులకు బీమా సౌకర్యం

-మెరైన్‌ ఎగుమతుల పెంపునకు 55 లక్షల ఉద్యోగాలు

-పశుసంవర్ధక మౌలిక వసతులకు రూ 15,000 కోట్లు

-పశువులు, జీవాలకు వ్యాక్సిన్‌ల కోసం రూ 13,300 కోట్లు

-53 కోట్ల జీవాలకు 100 శాతం వ్యాక్సినేషన్‌

-తేనెటీగల పెంపకందారులకు రూ 5 వేల కోట్లు

-ఔషధ మొక్కల సాగుకు రూ 4 వేల కోట్లతో నిధి