ఎనీ టైమ్ నో క్యాష్..!ఎన్నాళ్లీ క్యాష్ కష్టాలు..? - MicTv.in - Telugu News
mictv telugu

ఎనీ టైమ్ నో క్యాష్..!ఎన్నాళ్లీ క్యాష్ కష్టాలు..?

June 10, 2017


వందల్లో ఏటీఎంలు..వందల అడుగులకో ఏటీఎం. బట్ ఎనీ టైం నో క్యాష్. డీమానిటైజేషన్ తో మొదలైన కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి.హైదరాబాద్ లో పదిశాతం ఏటీఎంలు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. నో క్యాష్ బోర్డులు ఎక్కడా కనిపించలేవు. లోపలకు వెళ్లి డ్రా చేయబోతే.. చివరకు సారీ మేసేజ్ దర్శనం ఇస్తుంది. 60 రోజులు ,120 రోజులు కాదు.. 240 రోజులు కావొస్తున్నా… ఎటీఎంలో సరిగ్గా క్యాష్ నింపలేకపోతున్నారు. ఇంకా ఎన్నాళ్లీ క్యాష్ కష్టాలు..?
బ్లింక్ బ్లింక్ మంటూ ఏటీఎంలు రా రమ్మని ఆహ్వానిస్తుంటాయి. లోపలకెళ్లి పాస్ వర్డ్ కొట్టి డ్రా చేయబోతే మాత్రం క్యాష్ రానంటోంది. డీమానిటైజేషన్ తర్వాత హైదరాబాద్ లో సగం ఏటీఎంలే పనిచేస్తున్నాయి. అందులో పావు సగంలో కూడా సరిగ్గా క్యాష్ నింపలేకపోతున్నారు. ఎప్పుడూ వెళ్లిన డబ్బులు రాని ఏటీఎంలే ఉంటున్నాయి. సాలరీ పడ్డాక డ్రా చేసుకుందామని వెళ్లినోళ్లకు నిరాశే ఎదురవుతుంది. అర్జెంట్ డబ్బులు అవసరం ఉన్నవాళ్ల గోస చెప్పలేనిది.

పది ఏటీఎంలు తిరిగినా ఒక్కటి పనిచేయలేదు. ఏదో ఒకచోట ఏటీఎం పనిచేసినా గంటలకొద్దీ క్యూలో నిలపడాల్సింది. ఇంకా దారుణమేంటంటే.. బ్యాంకుల్లో, బ్యాంకు పక్కన ఉన్న ఏటీఎంల్లో కూడా నో క్యాష్ బోర్డులే కనిపిస్తాయి. లోపలకు వెళ్లి బ్యాంకోళ్లను అడిగితే మాకు ఏం తెలియదు.. వాళ్లు క్యాష్ నింపడం లేదు.. మమ్ముల్ని ఏం చేయంటారు అనే ఆన్సారిస్తున్నారు.

పనిచేయని ఏటీఎంలు దగ్గర కూడా నో క్యాష్ బోర్డులు ఉండవు. సెక్యూరిటీ గార్డులు అసలు ఉండరు. కొన్ని దగ్గర్లైతే ఏటీఎంలు డోర్లు పీకేసి గోడలకు అనించారు. వాటి నిర్వహణను గాలికొదిలేశారు. చెత్త, చిత్తు స్లిపులతో ఏటీఎం గది అంతా నిండిపోయింది. కొన్నిచోట్ల పనిచేయని మెషీన్లకు ఏసీలు ఫుల్లుగా వదిలితే..మరికొన్నిచోట్ల పనిచేసే ఏటీఎంల్లో ఏసీలు నడవటం లేదు. వీటి నిర్వహణలో నిలువెల్లా నిర్లక్ష్యం కనిపిస్తుంది.

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న డీమానిటైజేషన్ అసలు ఫలితాల సంగతి పక్కనపెడితే…జనానికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా అవే కష్టాలు వెంటాడుతున్నాయి. జేబులో నాలుగైదు ఏటీఎంలు కార్డులున్నా టైమ్ కు వంద రూపాయలు కూడా రావు. క్యాష్ విత్ డ్రాల కోసం బ్యాంకులకు వెళ్తే తలతోకలేని రూల్స్ తో బ్యాంకర్స్ ఇబ్బందులు పెడుతున్నారు. అకౌంట్ లో క్యాష్ వేయాలన్నా..తీయ్యాలన్నా తెగ సతాయిస్తున్నారు. క్యాష్ లెస్ ట్రాజక్షన్స్ ఏమోకానీ యుజ్ లెస్ రూల్స్ తో ఖాతాదారులు పరేషాన్ అవుతున్నారు. మరోవైపు బ్యాంకుల చార్జీల బాదుడుతో …బ్యాంకులకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్ లో నగదురహిత లావాదేవీలు సంగతేమోగానీ… బ్యాంకులకు,,ఏటీఎంలకు జనం దూరం కావడం పక్కా..డీమానిటైజేషన్ ఎప్టెక్ ఆర్నెళ్ల వరకు ఉండటం మరి దారుణం..ఇకనైనా బ్యాంకర్లు,,కేంద్ర ప్రభుత్వ అధికారులు మేల్కొవాలి. లేదంటే క్యాష్ లెస్ ట్రాజక్షన్స్ కాదు.. కస్టమర్ లెస్ బ్యాంక్ లను చూడాల్సి వుస్తోంది.