Atrocious incident in Kabul.. 20 people died
mictv telugu

దారుణ ఘటన..20 మంది మృతి

August 18, 2022

అఫ్గానిస్థాన్‌‌ రాజధాని కాబూల్‌లో దారుణ ఘటన జరిగింది. మసీదులో ప్రార్థనలు చేస్తున్న 20 మంది అక్కడికిక్కడే మృతి చెందగా, మరో 40 మందిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో అఫ్గానిస్థాన్‌‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకొని. మ‌ృతదేహాలను వెలికి తీసి, ఘటన సంభవించడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

”కాబుల్‌లో నగరంలోని ఖైర్‌ ఖానా ప్రాంతంలో ఉన్న మసీదులో బుధవారం ప్రార్థనలు జరుగుతుండగా, ఓ భారీ పేలుడు సంభవించింది. దీంతో మసీదు ఇమామ్‌ సహా 20 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 40 మందిపైగా గాయపడ్డారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న భవనాల కిటికీలు ధ్వంసమైయ్యాయి” అని అధికారులు తెలిపారు.

ఈ ఘటన సంభవించడంతో తాలిబన్ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమైయ్యారు. మదర్సాలో భారీ పేలుడు ఎక్కడి నుంచి జరిగింది? ఎవరు కారకులు అనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే, మృతి చెందిన వారిలో ఏడేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలిపారు.