Atrocious..Teachers who beat a student to death for a watch
mictv telugu

దారుణం..వాచీ కోసం విద్యార్థిని కొట్టి చంపిన ఉపాధ్యాయులు

July 27, 2022

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కన్నౌజ్ జిల్లా పాషిమ్ మడైయా గ్రామంలో దారుణం జరిగింది. వాచీ దొంగిలించాడన్న అనుమానంతో 15 ఏళ్ల విద్యార్థిని ముగ్గురు ఉపాధ్యాయులు కలిసి గదిలో బంధించి దారుణంగా చితకబాదారు. దాంతో దెబ్బలు తట్టుకోలేక ఆ విద్యార్థి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు దిక్కుతోచని పరిస్థితిలో ఆ టీచర్లను ఏం చేయలేక కన్నీరు మున్నీరు అవుతూ, అల్లాడిపోయారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి వివరాలను వెల్లడించారు.

”ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలోని పాషిమ్ మడైయా గ్రామంలో ఈ ఘటన జరిగింది. దిల్షన్ అలియాస్ రాజా అనే 15 ఏళ్ల విద్యార్థి ఈ నెల 23న అడ్మిషన్ కోసం ఆర్ఎస్ ఇంటర్ కాలేజీకి వెళ్లాడు. ఆ తర్వాత వాచ్ దొంగతనం జరిగిందంటూ శివకుమార్ యాదవ్ అనే టీచర్ రాజాను కాలేజీకి బలవంతంగా లాక్కెళ్లాడు. దాంతో రాజా తండ్రి ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతలోనే శివకూమార్ తన సహ ఉపాధ్యాయులైన ప్రభాకర్, వివేక్ యాదవ్‌లతో కలిసి ఆ బాలుడిని గదిలో బంధించి దారుణంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన రాజాను విద్యార్థులు స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి కాన్పూరు తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి రాజా మృతి చెందాడు. ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నాం” అని పోలీసులు అన్నారు.