దారుణం..కుటుంబ మొత్తాన్ని నరికి చంపిన పూజారి..ఆపై శవాల వద్ద
దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా క్షుద్రపూజల పేరుతో పలు దారుణమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రాను రాను కొత్త కొత్త టెక్నాలజీలు, పలు అధునాతన విధానాలు అమల్లోకి వస్తున్నప్పటికి, ఇప్పటికి కొంతమంది క్షుద్రపూజలు చేయించుకుంటే, తమకు తమ కుటుంబానికి మంచి జరుగుతుందని, మాంత్రికుడు ఏం చెప్పిన చేయడానికి సిద్దమవుతున్నారు. తాజాగా ఓ పూజారి క్షుద్రపూజల పేరుతో తన సొంత కుటుంబ సభ్యులనే అతి కిరాతకంగా నరకి చంపేశాడు. ఆ తర్వాత ఆ శవాల వద్ద క్షుద్రపూజలు చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో కలకలం సృష్టిస్తున్నది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని బండాకు చెందిన మహేష్ కుమార్ తివారీ అనే వ్యక్తి పూజారీగా పనిచేస్తూ, జీవనం కొనసాగిస్తున్నాడు. గత ఏడేళ్లుగా డెహ్రాడూన్‌లోని రాణి పోఖారీలో నివసిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ, సోమవారం ఉదయం సొంత కుంటుంబాన్ని నరికి చంపాడు. 47 ఏళ్ల పూజారి కుటుంబంలోని అయిదగురిని కత్తితో పొడిచి హత్య చేయటం కలకలం రేపింది. మృతుల్లో నిందితుడి తల్లి, భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హత్య అనంతరం ఆ మృదేహాల వద్ద పూజారి క్షుద్రపూజలు నిర్వహించాడు.
అయితే, ఇంట్లో నుంచి కుటుంబ సభ్యుల అరుపులు రావడంతో చుట్టుపక్కల ఉన్నవారు పోలీసులకు తెలియజేశారు. దాంతో అప్రమత్తమైన డెహ్రాడూన్ పోలీసులు..ఘటన స్థలానికి చేరుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇంత దారుణానికి ఎందుకు తెగబడ్డాడు? సొంత కుటుంబ సభ్యులనే ఎందుకు హత్య చేశాడు? క్షుద్రపూజలు చేసింది ఎవరు? అనే విషయాలపై విచారణ చేస్తున్నారు. ఇంకా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియలేదు. విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.