చెన్నైలో దారుణం.. తల్లి శవాన్ని డ్రమ్‌లో పెట్టి, సిమెంట్‌తో.. - MicTv.in - Telugu News
mictv telugu

చెన్నైలో దారుణం.. తల్లి శవాన్ని డ్రమ్‌లో పెట్టి, సిమెంట్‌తో..

May 17, 2022

తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. ఓ కుమారుడు తన తల్లి శవాన్ని ఓ డ్రమ్‌లో పెట్టి, సిమెంట్‌తో కప్పేసి, ఇంట్లోనే ఉంచుకున్న ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..” చెన్నై నీలాంకరై సరస్వతి నగర్‌కు చెందిన గోపాల్, షెన్బగం దంపతులకు ప్రభు, మురుగన్, సురేష్‌ అనే కుమారులు ఉన్నారు. గోపాల్‌ గతంలోనే మరణించాడు. ప్రభు, మురుగన్‌లు చెన్నైలోనే వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో చిన్న కుమారుడు సురేష్‌(50), తల్లి షెన్బగం (86) మాత్రమే ఉన్నారు. అతని మానసిక పరిస్థితి బాగలేకపోవడంతో నెల రోజుల క్రితం సురేష్‌ను భార్య, పిల్లలు వదిలి వెళ్లిపోయారు.” అని తెలిపారు.

అయితే, అప్పటి నుంచి తల్లితో కలిసి సురేష్‌ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం తల్లిని చూసేందుకు పెద్ద కుమారుడు ప్రభు ఆ ఇంటికి వచ్చాడు. అమ్మ ఇంట్లో లేదని చెప్పడమే కాకుండా, ఇంట్లోకి తనను అనుమతించకపోవడంతో ప్రభు నీలాంకరై పోలీసుల్ని ఆశ్రయించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. తనిఖీలు చేయగా, ఆ డ్రమ్‌లో తల్లి మృతదేహాన్ని దాచినట్లు సురేష్‌ చెప్పాడు. ఆ తర్వాత ఆ డ్రమ్‌ను పగల కొట్టి చూడగా అందులో షెన్భగం మృతదేహం బయట పడింది.