హైదారాబాద్‌లో దారుణం.. చిన్నారుల గుడ్డలు ఊడదీసి - MicTv.in - Telugu News
mictv telugu

హైదారాబాద్‌లో దారుణం.. చిన్నారుల గుడ్డలు ఊడదీసి

May 5, 2022

హైదరాబాద్‌ మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్లాబండ గుట్టపై జరిగిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరదాగా ఆడుకుంటున్న 16మంది చిన్నారులపై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డి, పిల్లల గుడ్డలు ఊడదీసి పిరుదులపై, వీపుపై కర్రతో చితకబాదారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..’గుఫానగర్‌లో ఈ మధ్యే వేసవి సెలవులు రావడంతో, 16మంది చిన్నారులు కలిసి ఆడుకుంటుండగా, ఓ వ్యక్తి వారి వద్దకు వచ్చి నల్లగుట్ట దగ్గర ఆడుకోండి. ఆటోలో దింపుతా అంటూ వారిని గుట్టపైకి తీసుకెళ్లాడు. అప్పటికే గుట్టపై ఉన్న ఆమోజ్‌ (18), రాహుల్‌(19) మరో బాలుడు కలిసి ఆ చిన్నారులను బెదిరించారు. బట్టలు ఊడదీయించి, కర్రతో చితకబాదారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే, మళ్లీ కొడతామని బెదిరించారు. దాంతో చిన్నారులెవరూ విషయాన్ని వారి తల్లిదండ్రులకు చెప్పలేదు’ అని అన్నారు.

మంగళవారం ఓ తల్లి తన కొడుకుకు స్నానం చేయిస్తుండగా అతని వీపు, పిరుదులపై కమిలిపోయిన గాయాలు ఉండడంతో అనుమానం వచ్చి గట్టిగా అడిగింది. దాంతో అసలు విషయం బయటపడింది. వెంటనే ఆరుగురు పిల్లల తల్లిదండ్రులు జరిగిన దారుణాన్ని పోలీసులకు వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీఆర్పీసీ సెక్షన్‌ 41 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు