హైదరాబాద్‌లో దారుణం.. నలుగురు యువకులతో లైంగిక దాడి - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో దారుణం.. నలుగురు యువకులతో లైంగిక దాడి

May 29, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై నలుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కొండాపూర్‌లో నివాసం ఉంటున్న గాయత్రి అనే మహిళ తన స్నేహితురాలిపై పథకం ప్రకారం..నలుగురు యువకులతో తీవ్రంగా దాడి చేయించి, ఆమెపై ఆ యువకులతో లైంగిక దాడి చేయిస్తూ, వీడియోను తీసి యువతిని బెదిరించిన ఘటన కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ” గాయత్రితోపాటు మరో యువతి కలిసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. ఇద్దరి మధ్య బాగా పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. గాయత్రి తన ఆరోగ్యం బాగోలేదని ఆ యువతిని కొండాపూర్‌లోని తన ఇంటికి పిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు బాధితురాలిని గాయత్రి తన ఇంట్లోనే పెట్టుకుంది. దాంతో గాయత్రి భర్త శ్రీకాంత్, ఆ యువతితో స్నేహంగా ఉండటం చూసిన గాయత్రి.. ఆ యువతిపై అనుమానం పెంచుకుంది. ఏప్రిల్ 24న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇటీవలే కేసును వితడ్రా చేసుకుని, బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడింది. కాసేపటిలోనే పథకం ప్రకారం..ఆ యువతిని గదిలోకి తీసుకెళ్లి, కిరాయికి మాట్లాడుకున్న నలుగురు యువకులతో దాడి చేయించి, యువతి నోట్లో గుడ్డలు కుక్కి తీవ్రంగా హింసించి, నలుగురు యువకులతో ఆమెపై లైంగికదాడి చేయిస్తూ.. ఆ ఘటనను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించింది.” ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన యువతిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. అనంతరం గాయత్రితోపాటు, ఆ నలుగురు యువకులను అరెస్టు చేశారు.