కడప జిల్లాలో దారుణం.. ఫోన్ గట్టిగా మాట్లాడుతున్నాడని - MicTv.in - Telugu News
mictv telugu

కడప జిల్లాలో దారుణం.. ఫోన్ గట్టిగా మాట్లాడుతున్నాడని

May 16, 2022

ఓ వ్యక్తి ఫోన్‌లో గట్టిగా గట్టిగా మాట్లాడుతున్నాడని అతనిపై ఓ ఇద్దరు వ్యక్తులు కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం మడూరు రోడ్డులో జరిగింది. ఈ ఘటనలో బాధితుడి ముఖం, ఒళ్లంతా కాలి, చావు బతుకులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పోలీసుల వివరాల ప్రకారం..”నరసింహ అనే వ్యక్తి పాత బట్టల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం మడూరు రోడ్డులోని ఖాళీ ప్రదేశంలో నరసింహ మద్యం సేవించి, ఫోన్‌లో గట్టిగా గట్టిగా మాట్లాడాడు. పక్కనే మరో గ్రూప్ మద్యం తాగుతున్నారు. అందులో చిన్న, ప్రసాద్‌లు ఫోన్‌లో ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావని నరసింహను ప్రశ్నించారు. ఇరువురు మద్యం మత్తులో ఉండడంతో మాట మాట పెరిగి, చిన్న, ప్రసాద్‌లు నరసింహ ముఖంపై పెట్రోల్ పోసి, నిప్పంటించారు.”

ఈ ఘటనలో నరసింహ ముఖం, శరీరం కాలిపోయింది. బాధితుడు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు.. నరసింహను ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మెరుగైన వైద్యం కోసం నరసింహను కడప రిమ్స్‌కు తరలించారు.