కాకినాడలో దారుణం..కరోనా మందు పేరుతో బాలికపై అత్యాచారం - MicTv.in - Telugu News
mictv telugu

కాకినాడలో దారుణం..కరోనా మందు పేరుతో బాలికపై అత్యాచారం

June 5, 2022

ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని రోజులుగా మహిళలపై, యువతులపై, బాలికలపై అత్యాచారాలు జరగటం మాత్రం ఆగటం లేదు. ఇటీవలే గుంటూరు జిల్లా తెనాలిలో ఓ మైనర్ బాలికను ముగ్గురు దుండగులు కిడ్నాప్ చేసి, అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవకముందే తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. కాకినాడలో ఓ 15 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల కరస్పాండెంట్ కరోనా మందు పేరుతో బాలికకు మత్తు మందులు ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ నగరానికి చెందిన బాధిత బాలిక ఆరో తరగతి నుంచి కొండయ్యపాలెంలోని హెల్పింగ్ హ్యాండ్స్ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ, చదువుకుంటోంది. తండ్రి చనిపోవడంతో తల్లే ఆమెను చూసుకుంటోంది. ఇటీవలే తొమ్మిదోవ తరగతి పరీక్షలు రాసిన బాలికపై వసతి గృహం కరస్పాండెంట్ కొత్తపల్లి విజయకుమార్ (60) కన్ను పడింది. ఏప్రిల్‌ నెలలో బాలికకు మాయమాటలు చెప్పి, అతని గదికి తీసుకెళ్లి, విజయకుమార్ కరోనా మాత్రలంటూ బాలికకు కొన్ని మాత్రలు ఇచ్చాడు. అవి వేసుకున్నా కొద్దిసేపటికే బాలిక మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు” అని వివరాలు వెల్లడించారు.

అనంతరం వేసవి సెలవులకు ఇంటికెళ్లిన బాలికకు మూడు రోజులుగా తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో తల్లి గమనించి ఏం జరిగింది అని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే నగరంలోని పోలీసు స్టేషన్‌లో విజయకుమార్‌పై బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విజయకుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అతని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధిత బాలిక కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు.