ములుగులో దారుణం.. బతికుండగానే - MicTv.in - Telugu News
mictv telugu

ములుగులో దారుణం.. బతికుండగానే

April 28, 2022

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వ్యక్తి బతికుండగానే శ్మశానవాటికకు తరలించిన సంఘటన చోటచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా వెంకటాపూర్‌లో కేశోజు లక్ష్మణచారి(30) తల్లిదండ్రులు సోమయ్య, సరోజినితో కలిసి 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆరు నెలల క్రితం ప్రమాదవశాత్తు లక్ష్మణచారి వెన్నెముకకు గాయమై నడవలేని స్థితికి చేరుకున్నారు. ఆసుపత్రిలో ఉంచి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. మంగళవారం సాయంత్రం అతని పరిస్థితి విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు.

దీంతో కొన ఊపిరితో ఉన్న ఆ యువకుడిని అద్దె ఇంటి యజమాని ఇంట్లోకి రానీయకపోవడంతో బతికుండగానే శ్మశానవాటికకు తరలించారు. దీంతో ఆ యువకుడు శ్మశానంలో తుదిశ్వాస విడిచాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై రాధిక, సర్పంచి అశోక్, పంచాయతీ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు.