నిజామాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. కుక్క నోట్లో మనిషి చేయిని చూసి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన నగరంలోని ఒకటో డివిజన్ పరిధిలోని భాగ్యనగర్‌లో చోటు చేసుకుంది. కుళ్లిపోయిన మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. అంతటితో ఆగకుండా మృతదేహం చేతిని కుక్కలు బయటకు తీసుకువచ్చాయి. కుక్క నోట్లో మనిషి చేయిని చూసి స్థానికులు బెదిరిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఆ మృతదేహం ఎవరిది అన్న కోణంలో విచారించిన పోలీసులు.. ఎడపల్లి మండలం జమిలం గ్రామానికి చెందిన యాదగిరి (55)గా గుర్తించారు. అతను కొన్ని నెలలుగా భాగ్యనగర్ కాలనీలో ఒక్కడే అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో నిద్రిస్తుండగానే మరణించి వుంటాడని, ఎవరూ గుర్తించకపోవడంతో శవం కుళ్లిపోయి వుంటుందని స్థానికులు అనుమానం వ్యక్తంచేశారు. శవం కుళ్లిపోవడంతో వీదికుక్కులు ఇంట్లోకి వెళ్లి మృతదేహాన్ని పీక్కుతిన్నాయి. ఒక కుక్క మృతుడి చేతిని బయటకు తీసుకురావడంతో స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదుచేశారని వెల్లడించారు. ఈ ఘటనపై మృతుడి సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.