కర్ణాటక రాష్ట్రం బాగల్ కోట్లో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. నడ్డిరోడ్డులో అందరూ చూస్తుండగానే ఓ మహిళా న్యాయవాదిపై ఓ వ్యక్తి తీవ్రంగా దాడి చేశాడు. కడుపులో తన్నుతూ, కొడుతూ కృరంగా ప్రవర్తించాడు. అడ్డొచ్చిన ఆమె భర్తపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట సంచలనంగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..” దాడి చేసిన వ్యక్తి పేరు మహంతేశ్ చొలచగడ్డగా, బాధితురాలు సంగీత షిక్కేరిగా గుర్తించాం.సంగీత న్యాయవాది. మహంతేశ్ బాగల్ కోట్‌లోని హార్టికల్చర్ సైన్సెస్‌లో ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. బాగల్ కోట్ జనరల్ సెక్రటరీ బీజేపీ నాయకుడు రాజు నాయకర్ ఆమెను ఓ ఆస్తికి సంబంధించిన విషయంలో వేధిస్తున్నాడని, దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు సంగీత తెలిపింది. అందుకే వారు ఆమెపై ఈ దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మహంతేశ్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నాం”.