పాకిస్థాన్‌లో హోలీ జరుపుకుంటున్న హిందూ విద్యార్థులపై దాడి జరిగింది. లాహోర్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో హిందూ విద్యార్థులపై దుండగులు దాడి చేశారు. పంజాబ్ యూనివర్శిటీలోని లా కాలేజీలో దాదాపు 30 మంది హిందూ విద్యార్థులు హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇంతలో, రాడికల్ ముస్లింలు వారిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. హోలీ సంబరాలు చేసుకోవద్దంటూ విద్యార్థులను క్యాంపస్ నుంచి బయటకు పంపించారు.
దాడిలో 15 మందికి పైగా హిందూ విద్యార్థులు గాయపడ్డారు. హోలీ జరుపుకునేందుకు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి తీసుకున్నారని హిందూ విద్యార్థులు చెబుతున్నారు. అయినప్పటికీ వారిపై దాడిని జరిగిందని వాపోయారు. గాయపడిన హిందూ విద్యార్థులు లాహోర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.
Hindu Students were attacked by Jamite Islami goons on celebrating Holi festival in Punjab University, Lahore.pic.twitter.com/nPbxRsdHYM
— Anshul Pandey (@Anshulspiritual) March 6, 2023
యూనివర్సిటీ విద్యార్థి, ప్రత్యక్ష సాక్షి కాషిఫ్ బ్రోహి ఈ ఘటన గురించి మాట్లాడుతూ “విద్యార్థులు లా కాలేజీ లాన్‌లలో గుమిగూడగా, ఇస్లామిక్ జమియత్ తుల్బా కార్యకర్తలు హోలీ జరుపుకోకుండా వారిని బలవంతంగా అడ్డుకున్నారు, ఇది ఘర్షణకు దారితీసింది, 15 మంది హిందూ విద్యార్థులు గాయపడ్డారు.” ” సింధ్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ కాషిఫ్ బ్రోహి మాట్లాడుతూ.. యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి పొందిన తర్వాత హిందూ సంఘాలు, కౌన్సిల్ సభ్యులు హోలీని నిర్వహించినట్లు తెలిపారు.