Attack on TDP leader with knife
mictv telugu

భవాని మాలలో వచ్చి టీడీపీ నేతపై కత్తితో దాడి… 

November 17, 2022

కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. ఓ దుండగుడు శేషగిరిరావుపై దాడి చేశాడు. భవానీ మాలలో ఉన్న వ్యక్తి భిక్షాటన పేరుతో శేషగిరిరావుపై ఇంటికి వచ్చి మాటలు కలిపాడు. ఈ క్రమంలో టీడీపీ నేత దానం చేస్తుండగా ఒక్కసారిగా కత్తితో దాడికి దిగాడు. తిరిగి శేషగిరిరావు ప్రతిఘటించడంతో వెంటనే నిందితుడు అక్కడి నుంచి బైక్ పై పారిపోయాడు. ఈ దాడిలో టీడీపీ నేత చేతికి, తలకి బలమైన గాయాలు అయ్యాయి.అతనిని దగ్గర ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.