జీపుకు దారివ్వలేదని దళితుడిపై ఖాకీల పైశాచికం - MicTv.in - Telugu News
mictv telugu

జీపుకు దారివ్వలేదని దళితుడిపై ఖాకీల పైశాచికం

March 19, 2018

చేతిలో లాఠీ, పైనుంచి అధికారుల అండ ఉందని పోలీసులు రెచ్చిపోతున్నారు. సినిమాల్లో కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తన జీపుకు దారి ఇవ్వలేదంటూ వరంగల్ జిల్లా శాయంపేట్ ఎస్ఐ రాజబాబు.. ఓ దళిత యువకుడిపై తీవ్రంగా దాడి చేశారు. ఎస్‌ఐతో మరికొందరు పోలీసులు అతణ్ని పక్కనున్న మాందరిపేట గుట్టలోకి తీసుకెళ్లి కొట్టారు. దీనిపై సర్వాత్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.

రాజబాబు వెళ్తున్న జీపు వెళ్తుండగా అదే దారిలో కొత్తగట్టు సింగారానికి చెందిన పెంబర్తి భరత్ అనే దళిత యవకుడు కూడా వెళ్తూ కనిపించాడు. వెనక జీపు వస్తోందని తెలియని భరత్ తన దారిన తాను పోతున్నాడు. అయితే అతడు ఓ పక్కకు జరగలేదంటూ ఖాకీలు రెచ్చిపోయారు. ‘ఏం, కొవ్వెక్కిందారా? హారన్ కొడుతున్నా సైడ్ జరగవారా..’ అంటూ నానా దుర్భాషలాడారు. తర్వాత గుట్టలోకి తీసుకెళ్లి పచ్చిబూతులు తిడుతూ లాఠీలతో, బూట్లతో తన్నారు.