500 కేజీల బాంబుతో దాడి.. 18 మంది పౌరుల మృతి - MicTv.in - Telugu News
mictv telugu

500 కేజీల బాంబుతో దాడి.. 18 మంది పౌరుల మృతి

March 8, 2022

29

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తాజాగా 500 కేజీల బరువున్న రెండు బాంబులను ఆ దేశంలోకి జారవిడిచింది. అవి నివాస సముదాయాలపై పడగా, వాటిలో ఒకటి పేలి 18 మంది పౌరులు మృతి చెందారు. అందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు సమాచార మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. మరోవైపు చెర్నవిహ్‌లోని ఓ భవనంపై రష్యా ఇలాంటి బాంబునే వేయగా, అది పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పేలని బాంబు ఫోటోను విదేశాంగ మంత్రి దిమిత్రో ట్వీట్ చేశారు. దాంతో పాటు ‘రష్యా ఇలాంటి దాడులను చేస్తూ అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. మా దేశాన్ని రక్షించుకోవడానికి మాకు సహాయపడండి. గగనతలాన్ని మూసివేసి మాకు యుద్ధ విమానాలను అందించాల’ ఆయన కోరారు. కాగా, ఉక్రెయిన్ అడుగుతున్న సహాయం నాటో దేశాలను ఉద్దేశించిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.