నెక్లెస్ రోడ్‌లో ప్రేమజంటపై దాడి.. - MicTv.in - Telugu News
mictv telugu

నెక్లెస్ రోడ్‌లో ప్రేమజంటపై దాడి..

June 13, 2019

Attacking Love couple .. Lover's condition Seriuse.

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో ఓ ప్రేమజంటపై కొందరు యువకులు విచక్షణా రహితంగా దాడి చేశారు. విహారానికి వెళ్లిన ఆ జంటపై నిన్న రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన ప్రియురాలితో కలిసి ఓ యువకుడు నడుస్తూ వెళుతున్నాడు. ఇంతలో కొందరు గుర్తు తెలియని యువకులు వెనకాల నుంచి వచ్చి అమాంతం వారి మీద పడి చితకబాదారు.

యువకుడిని తీవ్రంగా కొట్టారు. అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన వారిలో ఒకరిని గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.