రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ నేత ఆయనే.. టీఆర్ఎస్ ఎంపీలు - MicTv.in - Telugu News
mictv telugu

రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ నేత ఆయనే.. టీఆర్ఎస్ ఎంపీలు

November 8, 2022

 

 Attar flop politician TRS MPs gave strong counter to BJP leaders

టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ది అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ అని, అందుకు మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలే నిదర్శనమని చెప్పిన ఓ బీజేపీ నేతకు గట్టి కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ నేతలు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడైన వివేక్ వెంకటస్వామి.. సోమవారం ఆ పార్టీ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఓ ఫెయిల్యూర్ లీడర్ అని, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌గా ఉండి సొంత చెల్లిని గెలిపించుకోలేని అసమర్థుడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతూ… కేటీఆర్‌ను విమర్శించే స్థాయి వివేక్కు లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో ఎంపీలు వెంకటేశ్‌ నేత, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు సోమవారం మీడియాతో మాట్లాడారు. మునుగోడులో బీజేపీ ఓడిపోయినా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని ఎంపీ వెంకటేశ్‌ నేత విమర్శించారు.
TRS MPs gave strong counter to BJP leaders

సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వస్తే తమ బండారం బయటపడుతుందన్న భయంతో ఆయనను అడ్డుకోవాని మోదీ, అమిత్‌షా కుట్రలు పన్నుతున్నారని టీఆర్ఎస్ ఎంపీలు ధ్వజమమెత్తారు. బీజేపీ పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను మార్చిందని ఆరోపించారు. బండి సంజయ్‌ ఇప్పటికైనా జ్ఞానం పెంచుకోవాలని హితవు పలికారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను విమర్శించే హక్కు బీజేపీ నేత వివేక్‌కు లేదన్నారు ఎంపీ మాలోత్ కవిత. రాజకీయాల్లో అట్టర్‌ఫ్లాప్‌ నేత వివేక్‌ మాత్రమేనని కేటీఆర్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు హుజూరాబాద్‌ ఎన్నికల్లో.. ఇటీవల మునుగోడు ఎన్నికల సమయంలో పట్టుబడ్డ పైసలు వివేక్‌వేనన్నారు. బీజేపీ నేతలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆమె సూచించారు.