తాత్కాలిక కండక్టర్‌పై తాత్కాలిక డ్రైవర్ అత్యాచార యత్నం.. - MicTv.in - Telugu News
mictv telugu

తాత్కాలిక కండక్టర్‌పై తాత్కాలిక డ్రైవర్ అత్యాచార యత్నం..

October 18, 2019

టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా.. బస్సుల్లో తాత్కాలిక డ్రైవర్లు, తాత్కాలిక కండక్టర్లను ఉన్నతాధికారులు నియమించారు. దీంతో వారికి బస్సులపై సరైన అవగాహన లేక రాష్ట్రవ్యాప్తంగా చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నేరాలు, ఘోరాలు సాగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలతోపాటు బయటికి చెప్పుకోలేని దారుణాలు కూడా నమోదవుతున్నాయి.  తాత్కాలిక డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నకీచకుడు ఒకడు.. తాత్కాలిక మహిళ కండక్టర్‌పై లైంగిక దాడికి యత్నించాడు. మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 

temporary driver.

తాత్కాలిక డ్రైవర్‌ శ్రీనివాస్‌ చెన్నూరు నుంచి మంచిర్యాల వస్తున్న బస్సులో విధులు నిర్వహిస్తున్నాడు. అదే బస్సులో ఓ మహిళా కండక్టర్‌ కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెపై శ్రీనివాస్ కన్నేశాడు. ఎలాగైనా ఆమెను లోబరుచుకోవాలని అనుకున్నాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న అతను పథకం ప్రకారం బస్సులో ప్రయాణికులు ఎక్కకుండా చూసుకున్నాడు. మార్గమధ్యంలో నిర్మానుష్య ప్రాంతాన్ని చూసి బస్సును ఆపి మహిళా కండక్టర్‌పై లైంగిక దాడికి యత్నించాడు. అయితే బాధితురాలు శ్రీనివాస్‌ బారి నుంచి తప్పించుకుని జైపూర్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు జైపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.