బాలికపై మజ్లిస్ నేత అత్యాచార యత్నం - MicTv.in - Telugu News
mictv telugu

బాలికపై మజ్లిస్ నేత అత్యాచార యత్నం

March 17, 2022

gdhb

తెలంగాణ రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ఏళ్ల బాలికపై జాంబాగ్‌కు చెందిన మజ్లిస్ నాయకుడు రఫిక్ అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. పటేల్ నగర్‌లోని బాలాజీ అపార్ట్‌మెంట్‌లో ఉండే రఫిక్.. బాలికను భయపెట్టి తన ఇంట్లోనే లైంగిక దాడికి యత్నించడంతో ఆమె కేకలు వేసింది. దీంతో కుటుంబ సభ్యులకు బాలిక విషయం తెలపడంతో రఫిక్‌కు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారని తెలిపారు.

దీంతో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని అన్నారు. అనంతరం బేగంబజార్ పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడిని రిమాండ్‌కు తరలించామని తెలిపారు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా రఫిక్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, తమ బిడ్డకు న్యాయం జరగాలని పోలీసులను వేడుకున్నారు.